మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు ఆటో టైర్ పేలి పల్టీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది కీసర నుండి షామీర్ పేట్ వైపు కూలీ లతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం వెనుక టైర్ పేలి ఆటో పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మరో 11 మంది కి స్వల్ప గాయలయ్యాయి. మృతులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారుగా గుర్తింపు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
