సర్ ప్రక్రియ పేరుతో భారతదేశం లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆబాసు పాలు చేయడానికి మనువాదుల చెంచా అయిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని లేనియెడల రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు నిర్వహిస్తామని ఆర్ పి ఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నీరడీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
శనివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి రానప్పుడు సంపన్నులకు విద్యావంతులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉండేది, రాజ్యాంగం అమలు అయినా తర్వాత వందల కోట్లు ఉన్నవారికి ఒకే ఓటు కూలీ నాలీ చేసుకునే వారికి ఒకే ఓటు రాజ్యాంగం తీసుకువచ్చింది.
దానిని అబాసుపాలు చేయడానికి మనువాదుల చెంచా అయిన జ్ఞానేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టించడానికి దేశంలో కోటి 97 లక్షల ఓట్లను గల్లంతు చేసిన దుర్మార్గుడు అని అన్నారు. కాబట్టి ఆయనను వెంటనే అరెస్టు చేసి కొత్త కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల రాస్తారోకోలు ధర్నాలు నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల సంతోష్, జిల్లా కార్యదర్శి మల్లేష్, పట్టణ కార్యదర్శి జి. లక్ష్మణ్, కార్మిక నాయకుడు మోతే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
