HomePOLITICAL NEWSUncategorizedఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ పోటీ ......కవిత స్పష్టికరణ

ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ పోటీ ……కవిత స్పష్టికరణ

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేసారు . ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని తప్పుబట్టారు.

ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపైనా కవిత స్పందించారు. సాంకేతిక తప్పిదాల కారణంగా అధికారులు ఓట్లు తొలగిస్తున్నారని ఆమె మండిపడ్డారు . బీజేపీ ప్రోత్సాహంతో కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనే చర్చ ప్రజల్లో ఉందని కవిత పేర్కొన్నారు.

తన ఫామ్‌హౌస్‌వద్ద .ఎలాంటి అక్రమ భూములు లేవని, ఇనాం, కబ్జా లేదా అసైన్డ్ భూమి లేదని చెప్పారు. తన ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని, తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించామని ఆమె పేర్కొన్నారుఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు అత్యంత బాధాకరమని అన్నారు.

తెలంగాణలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైద్య సేవలు సరిగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రుల్లో మంత్రులు ఫోన్ చేసినా బెడ్లు దొరకని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments