మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, స్వర్గీయ డి.శ్రీనివాస్(డీఎస్) జయంతి సందర్భంగా ఆయన తనయుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘనంగా నివాళులర్పించారు.
కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద ఉన్న డి.శ్రీనివాస్ విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజలకు అందించిన సేవలను ఎంపీ అర్వింద్ స్మరించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, డీఎస్ అభిమానులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
