HomePOLITICAL NEWSUncategorizedప్రశాంతంగా ముగిసిన గణేశ్‌ నిమజ్జనం..ఎక్కడా అవాంఛనీయ ఘటనకు తావులేకుండా ముగింపు..

ప్రశాంతంగా ముగిసిన గణేశ్‌ నిమజ్జనం..ఎక్కడా అవాంఛనీయ ఘటనకు తావులేకుండా ముగింపు..

జిల్లాలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 48 గంటలపాటు వైభవంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా పూర్తయింది. నిమజ్జన కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పెద్దగా సమస్యలు తలెత్తలేదు. పక్కా ప్రణాళికతో చేపట్టిన ఏర్పాట్లు విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.నగరంతో పాటు జిల్లా పరిధిలోని ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాయి. భారీగా తరలివచ్చిన గణేశ్‌ విగ్రహాలు, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రధాన మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు.జిల్లావ్యాప్తంగా 5,811 గణేశ్‌ విగ్రహాలను జియోట్యాగ్‌ చేయగా.. నిమజ్జన బందోబస్తు కోసం సుమారు 1,300 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. ప్రధాన నిమజ్జన కేంద్రాలైన బాసర, ఉమ్మెడ బ్రిడ్జి, వినాయకుల బావి, బోర్గాం చెరువు, జాన్కంపేట్‌ చెరువు, ఆర్మూర్‌ గుండ్ల చెరువు, కాకతీయ కాలువ, బోధన్‌ పసుపువాగు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.నిమజ్జన శోభాయాత్రలో యువత, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని గణపతి నామస్మరణలతో సందడి చేశారు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు.
ఉమ్మెడ బ్రిడ్జి వద్ద సిపి భద్రతా ఏర్పాట్ల పరిశీలన
గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఆదివారం తెల్లవారుజామున పరిశీలించారు. నిమజ్జనానికి భారీగా తరలివచ్చే భక్తులు, గణేశ్‌ విగ్రహాలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల క్రమబద్ధీకరణ, భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించిన సీపీ.. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments