ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ లోని విగ్రహాల పార్కు లో గల ఆయన విగ్రహానికి బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమం లో గానీ, తెలంగాణ ఉద్యమం లోగాని కీలక పాత్ర పోషించారు. ఆయన తెలంగాణ జాతిపిత అని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ను ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బాండ్ పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు .
కొండాలక్ష్మన్ బాపూజీ తెలంగాణ మలి దశ ఉద్యమం లో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన రథ యాత్ర లో మేము భాగస్వామ్యం అయినందుకు గర్విస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామ కృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
