నగరంలోని వీక్లీ మార్కెట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిప్ప గ్రామానికి చెందిన కొండ ఆంజనేయులు (43)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఆంజనేయులుకు తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వన్‌టౌన్ పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం ఆరా తీస్తున్నారు.
