HomeTelanganaNizamabadబసవ గార్డెన్‌లో కలర్‌ బెల్ట్‌ ప్రమోషన్‌ టెస్ట్‌

బసవ గార్డెన్‌లో కలర్‌ బెల్ట్‌ ప్రమోషన్‌ టెస్ట్‌

టైక్వాండోతో శారీరక, మానసిక దృఢత్వంబాలికలు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందాలి: బసవపురం లక్ష్మీ నరసయ్య

చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అమేచూర్‌ టైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు బసవపురం లక్ష్మీ నరసయ్య అన్నారు. నిజామాబాద్‌లోని బసవ గార్డెన్‌లో ఆదివారం అమేచూర్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలర్‌ బెల్ట్‌ ప్రమోషన్‌ టెస్ట్‌ నిర్వహించారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జె.సి. మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో వివిధ విభాగాలకు చెందిన టైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథి లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ.. టైక్వాండో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా శరీర దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందాలని సూచించారు.ప్రమోషన్‌ టెస్ట్‌లో బెల్ట్‌లు సాధించిన క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పిల్లలను క్రమం తప్పకుండా శిక్షణకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. క్రీడాకారుల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషకాహారం అందించాలని సూచించారు.కార్యక్రమానికి తేజ హాస్పిటల్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుష్మ అతిథిగా హాజరయ్యారు. బ్లాక్‌ బెల్ట్‌ కోచ్‌లు గంగాధర్‌, నాగరాజ్‌, శివ, వినయ్‌, హనీషా, నితిన్‌, అసోసియేషన్‌ సభ్యులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ప్రధాన కార్యదర్శి జె.సి. మనోజ్‌కుమార్‌ను అతిథులు, అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments