నాగారం 80 క్వార్టర్స్ ప్రాంతంలో ప్లాట్ క్రయవిక్రయాలకు సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముంతాజ్ బేగం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అజీమ్, కరీమ్ అనే వ్యక్తుల మధ్య ప్లాట్ లావాదేవీలు నడిచాయి. కరీమ్ అనే వ్యక్తి అజీమ్‌కు ఒక ప్లాట్ విక్రయించాడు.ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ఈ ఘర్షణ లో అజీమ్ భార్య ముంతాజ్ బేగం కిందపడిపోవడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
