వేరే చోట హత్య చేసి.. కోకాపేటలో మృతదేహం పడేసినట్లు అనుమానంఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేట నియోపోలీస్ కురుమ సంఘం భవనం సమీపంలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా మృతుడిని గుర్తించారు.
తలపై తీవ్ర గాయాలుండటంతో క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.వెంకన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలిసింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాల సేకరణపై దృష్టి సారించారు.
ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతోపాటు పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.వెంకన్నను మరో ప్రాంతంలో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కోకాపేటకు తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
