HomeTelanganaNizamabadహోరాహోరీ మారిన రెడ్‌క్రాస్‌ ఎన్నికలు.......బీసీ సంఘాల ఆధిపత్య పోరుగా మారిన వైనం .......ఒకరిద్దరి నేతల నిర్వాహకం...

హోరాహోరీ మారిన రెడ్‌క్రాస్‌ ఎన్నికలు…….బీసీ సంఘాల ఆధిపత్య పోరుగా మారిన వైనం …….ఒకరిద్దరి నేతల నిర్వాహకం ……..పదవుల కోసం పట్టు అనివార్యం అయిన ఎన్నికలు ……..ఏళ్లతరబడిగ తిష్ట వేసిన వారికి చెక్ పెట్టేలా మరో ఫ్యానల్ …..

బీసీ సంఘాలను నిర్వీర్యం చేసిన ప్రబుద్ధులు ఇప్పుడు రెడ్ క్రాస్ మీద పడ్డారు. సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న రెడ్‌క్రాస్‌ లో ఎన్నికలు హోరాహోరీ మారాయి.ఏళ్లతరబడిగా పాతుక పోయిన అంతా తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్న వర్గానికి చెక్ పెట్టడానికి తెరవెనుక మంత్రాంగం నడుస్తుంది.

బీసీ సంఘాల నేతలు ఇప్పడు రెడ్ క్రాస్ లో ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. బీసీ సంఘాల నేతలు ఇప్పుడు రెడ్ క్రాస్ కోసం రెండు గ్రూప్ లుగా వీడి పోయారు. బీసీ సంఘాల లను నిలువునా చీల్చిఘనకార్యం సాధించిన వారే ఇప్పుడు రెడ్ క్రాస్ లో తమ ఆధిపత్యం చేజారకుండా ఎత్తుగడలు వేస్తున్నారు.

బీసీ సంఘాల ఐక్యత ను వ్యూహాత్మకంగా దెబ్బ తీసిన వారే ఎప్పుడు రెడ్ క్రాస్ ను సైతం తమ గుప్పట్లో వుంచుకోవడానికి తహతహ లాడుతూండడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. బీజేపీ భావజాలం ఉండే ఓ సామాజిక సంస్థ రెడ్ క్రాస్ లో పాగ వెయ్యడానికి రాష్ట్ర స్థాయిలోనే వ్యూహరచన చేసింది.

అందుకే గుట్టుగా సభ్యత్వం కూడా భారీగా చేయించింది. బీజేపీ లో క్రియాశీలకంగా వుండే బీసీ నేతలను రంగంలోకి దించింది. ఎందుకంటే ఏళ్లతరబడిగా ఈ సంస్థ లో తిష్ట వేసి వారంతా బీసీ సంఘాల నేతలుగా చెలామణి లో ఉన్నవారు కావడంతో వారుకూడా తమ పార్టీ లో వుండే బీసీ నేతలనేతలను ముందు పెట్టారు.

నిజానికి గతంలో ఎప్పుడు ఈ ఎప్పుడు సంస్థ కు ఎన్నికలు జరగకుండ తమలో తామే కథా నడిపే వారు దీనితో ఎప్పటిలాగే తమ ఆధిపత్యం వుండేలా స్కెచ్ వేశారు. పోటీ గా వచ్చిన వారికి ఎదో పోస్టు ఇస్తామని బేరాలు చేసారు కానీ క్రియాశీలక పదవులు ఇవ్వడానికి వారు ససేమిరా అన్నారు.

అయితే పాత కమిటీ లో ఓకె సామాజిక వర్గం పెత్తనం సాగించడం కూడా చాలామందికి మింగుడు పడలేదు.అందుకే ఏకగ్రీవ పక్రియ కు విఘాతం కలిగింది. ఎన్నికలు అనివార్యం అయ్యాయి. రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు సెప్టెంబరు 24న నోటిఫికేషన్‌ విడుదలైంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది.

మొత్తం 29 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. దీంతో మొత్తం 29 మంది బరిలో కొనసాగుతున్నారు. వీరంతా రెండు ప్యానళ్లుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కమిటీలో పనిచేసిన కొందరు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 9,826 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు సభ్యుల మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్యానళ్ల పేర్లతో ప్రచారం సాగుతోంది. సభ్యులను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడంతోపాటు తమ ప్యానల్‌ బలాబలాలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

రెడ్‌క్రాస్‌ ఎన్నికల్లో ఈసారి ప్యానళ్ల ఏర్పాటు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ రాజకీయ వర్గాలతో అనుబంధం ఉన్నవారితోపాటు బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్నవారూ బరిలో ఉన్నట్లు అభ్యర్థుల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో సేవా సంస్థ ఎన్నికలకు రాజకీయ సమీకరణాల ప్రభావం ఎంతమేర ఉంటుందన్న చర్చ సభ్యుల్లో సాగుతోంది. తమకు అనుకూలమైన ఓటర్ల సమీకరణాలను బలోపేతం చేసుకునేందుకు ప్యానళ్లు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

4న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలుఅక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ బస్టాండ్‌ సమీపంలోని హరిచరణ్‌ పాఠశాలలో 20 పోలింగ్‌కు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments