HomeCRIMEమహిళ వేధింపులకు అడ్డుకట్ట.. 3,068 మంది పట్టివేతసెప్టెంబరులో షీ టీమ్స్‌ విస్తృత నిఘా..106 పెట్టీ కేసులు.....

మహిళ వేధింపులకు అడ్డుకట్ట.. 3,068 మంది పట్టివేతసెప్టెంబరులో షీ టీమ్స్‌ విస్తృత నిఘా..106 పెట్టీ కేసులు.. 961 మందికి కౌన్సెలింగ్‌

మహిళలను వేధిస్తూ బహిరంగ ప్రదేశాల్లో రెచ్చిపోతున్న ఆకతాయిలపై షీ టీమ్స్‌ కొరడా ఝుళిపించాయి. సెప్టెంబరు నెలలో హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా నిర్వహించిన నిఘా, తనిఖీల్లో 3,068 మంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వీరిలో 2,955 మంది మేజర్లు, 113 మంది మైనర్లు ఉన్నారు. ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ డాక్టర్‌ లావణ్య వివరాల ప్రకారం.. పండుగలు, ఉత్సవాల సందర్భంగా మహిళలు, బాలికల భద్రత కోసం రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.

పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌ మార్గదర్శకత్వంలో ఆలయాలు, నిమజ్జన, శోభాయాత్ర మార్గాలు, బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో సాదాదుస్తుల్లో సిబ్బందిని మోహరించారు. ఈవ్‌టీజింగ్‌, స్టాకింగ్‌, అసభ్యకర వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తన, అనుమతి లేని శారీరక స్పర్శ తదితర వేధింపులను గుర్తించి అక్కడికక్కడే చర్యలు చేపట్టారు.

వీడియో రికార్డింగ్‌ ద్వారా నిందితుల కదలికలను సైతం పర్యవేక్షించారు. పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యల్లో భాగంగా 106 పెట్టీ కేసులు నమోదయ్యాయి. ఐదు కేసుల్లో నిందితులకు ఏడు రోజుల వరకు జైలు శిక్షతోపాటు రూ.1,050 జరిమానా విధించారు.

40 కేసుల్లో రూ.1,050 జరిమానాతో పాటు ఐదు రోజుల వరకు సామాజిక సేవ శిక్ష విధించారు. మరో 61 కేసుల్లో ఒక్కొక్కరికి రూ.1,050 చొప్పున జరిమానా విధించారు. ముందస్తు నిరోధక చర్యల్లో భాగంగా 961 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో 2,001 కేసులు పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోషల్‌ మీడియాలో నకిలీ ప్రొఫైళ్లతో పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్‌ సూచించాయి.

వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పంచుకోవద్దని, సోషల్‌ మీడియా, ఈమెయిల్‌ ఖాతాలకు బలమైన ప్రత్యేక పాస్‌వర్డ్‌లు వినియోగించాలని, టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ)ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నాయి.స్టాకింగ్‌, బెదిరింపులు, దుర్భాషలు లేదా ఇతర వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని డీసీపీ డాక్టర్‌ లావణ్య కోరారు.

బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఫిర్యాదులు, సహాయం కోసం డయల్‌ 100 లేదా వాట్సాప్‌ 9490616555ను సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments