పాకిస్థాన్ లో తయారైన కాస్మో ప్రాడక్ట్స్ అక్రమంగా అమ్ముతున్న షాప్ లో సోదాలు చేసారు పోలీసులు. గురువారం . హైదరాబాద్ లోని నాంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ ఏరియాల్లోని కాస్మెటిక్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు
ఈ తనిఖీల్లో మేడ్ ఇన్ పాకిస్థాన్ లేబుల్ తో ఉన్న వస్తువులు అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు కొన్ని షాపుల్లో ప్రాణాంతకమైన కెమికల్స్ తో తయారు చేసిన ఫేస్ క్రీములు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ సహా ఇతర దేశాల నుంచి అక్రమంగా స్కిన్ వైటనింగ్ క్రీములు తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. దీంతో పాటు లైసెన్స్ లేకుండా నడుస్తున్న స్టోర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
