నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓగా బి. శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన నార్త్ రూరల్ సీఐగా పనిచేస్తూ ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన రఘుపతి హైదరాబాద్ ఐజి కార్యాలయానికి బదిలీ అయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
