HomeTelanganaNizamabadసామాజిక బహిష్కరణలపై రాష్ట్ర బీ.సీ కమిషన్ కు ఫిర్యాదులు..విజ్ఞాపనలు సమర్పించిన బాధితులు

సామాజిక బహిష్కరణలపై రాష్ట్ర బీ.సీ కమిషన్ కు ఫిర్యాదులు..విజ్ఞాపనలు సమర్పించిన బాధితులు

సామాజిక బహిష్కరణ ఉదంతాలపై తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మిలతో కూడిన బృందం బుధవారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధితులతో భేటీ అయ్యింది.

ఐ.డీ.ఓ.సీకి చేరుకున్న కమిషన్ ప్రతినిధులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంఘిక, కుల బహిష్కరణలకు గురైన బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కమిషన్ చైర్మన్, సభ్యులకు లిఖితపూర్వకంగా విజ్ఞాపనలు సమర్పించారు.

బాధితులు నిర్భీతితో, స్వేచ్చగా వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలోని ఆయా ప్రాంతాలలో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట కొనసాగుతున్న అరాచకాల గురించి, సామాజిక బహిష్కరణ ఘటనలను బాధితులు కమిషన్ కు ఏకరువు పెట్టారు.

బీసీ కుల సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారు, ప్రజా సంఘాల ప్రతినిధులు సైతం హాజరై రాతపూర్వకంగా విజ్ఞాపనలు కమిషన్ కు అందిస్తూ, మౌఖికంగా కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాంఘిక బహిష్కరణలపై ఫిర్యాదులు సమర్పించేందుకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments