HomeTelanganaNizamabadఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలినిజామాబాద్‌లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ధర్నా

ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలినిజామాబాద్‌లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ధర్నా

జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనంఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సంఘాల నాయకులు పెద్దిరాములు, వెంకటేష్‌, జె.శంకర్‌గౌడ్‌, రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సుమారు 13 కోట్ల ఓట్లను రద్దు చేయడం దుర్మార్గమని ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్‌ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలవాల్సిన ఎన్నికల కమిషన్‌ అవకాశవాద ధోరణితో రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరుస్తోందని, ప్రజల ఓటు హక్కును కాలరాస్తోందని అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన యువకులు, రాజకీయ పార్టీల నాయకులను అడ్డుకోవడానికి పోలీసులు, సైన్యాన్ని ఉపయోగించి నిర్బంధాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గౌరవించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో భవిష్యత్తులో మరింత తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జంగం గంగాధర్‌, సీఐటీయూ నాయకులు శ్రీనివాసరాజు, నన్నేసాబ్‌, సుకన్య, స్వప్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విఘ్నేష్‌రాజు, రైతు సంఘం నాయకులు రాజన్న, దేవేందర్‌సింగ్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు గోవర్ధన్‌, భాగ్యలక్ష్మి, షంషుద్దీన్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments