HomeCRIMEనగరపాలక సంస్థలో విషాదం.. ఫిట్స్‌ రావడంతో కుప్పకూలిన కార్మికుడు

నగరపాలక సంస్థలో విషాదం.. ఫిట్స్‌ రావడంతో కుప్పకూలిన కార్మికుడు

నగరపాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న మంగిలిపెల్లి భూమయ్య (ఓఎస్‌) విధి నిర్వహణలో ఉండగా మృతి చెందాడు. శనివారం నగరంలోని 57వ డివిజన్‌లో టాటా ఏస్‌ లోడర్‌పై విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో కుప్పకూలిపోయాడు.

వెంటనే స్పందించిన వాహన డ్రైవర్‌, శానిటరీ జవాన్‌, తోటి కార్మికులు, స్థానికులు భూమయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నగరపాలక సంస్థ సర్కిల్‌-3 పరిధిలో కార్తికేయ గ్రూపులో పనిచేస్తున్న భూమయ్య మృతితో తోటి కార్మికుల్లో విషాదం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments