నిజామాబాద్‌కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయురాలికి రాష్ట్ర జట్టులో చోటు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్టు వైస్ కెప్టెన్ , గోల్‌కీపర్‌గా నిజామాబాద్‌కు చెందిన భారతి ఎంపికయ్యారు.
మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న భారతి, ఇటీవల హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ హాకీ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించారు.
భారతి విధి నిర్వహణతో పాటు హాకీ క్రీడపై ఆసక్తిని కొనసాగిస్తూ సివిల్ సర్వీసెస్ పోటీల్లో పలుమార్లు తెలంగాణ జట్టు గోల్‌కీపర్‌గా ప్రాతినిధ్యం వహించారు. తాజాగా మరోసారి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడంపై పాఠశాల ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
