రాజంపేట మండలం పెద్దయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న మనస్విత (10) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది.
చిన్న వయసులోనే బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
