రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే పరిస్థితులు ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు రాత్రి, తెల్లవారుజామున చలి ప్రభావం క్రమంగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలున్నాయి.
వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులు చేపట్టే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.
ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్తు స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందకుండా సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలి. వర్ష సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
