- నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 40 సీట్లు
- ఈ నెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి రెండేళ్ల పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
తెలంగాణ పారామెడికల్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ)లో 30, డిప్లొమా ఇన్ డయాలసిస్ (డీడయాలసిస్)లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బైపీసీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఎంపీసీ, ఇతర గ్రూపుల అభ్యర్థులను పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం తెలంగాణ స్థానికత తప్పనిసరి.
దరఖాస్తు ఇలా..
అభ్యర్థులు తెలంగాణ పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tgpmb.telangana.gov.in లో ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసి, దాని ప్రతిని డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తుతో పాటు రూ.100 నగదు రుసుము, పదో తరగతి ధ్రువపత్రం, ఇంటర్ మార్కుల మెమో, బదిలీ ధ్రువపత్రం (టీసీ), ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు జతచేసి ఈ నెల 24లోగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ నెల 31న కౌన్సెలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నవంబరు 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డుకు పంపుతారు. నవంబరు 11 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
కోర్సులకు ఏడాదికి రూ.6,000 ట్యూషన్ ఫీజుగా నిర్ణయించారు. కోర్సు మధ్యలో చదువు నిలిపివేసే అభ్యర్థులు పూర్తి కోర్సు వ్యవధికి సంబంధించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.
