పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వేపై వరుసగా ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆరంఘర్ వైపు వెళ్లే మార్గంలో పిల్లర్ నంబర్ 131 సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఆపై విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది.
వెనుక నుంచి వస్తున్న మరో ఐదు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి.అకస్మాత్తుగా ముందున్న కారు ప్రమాదానికి గురికావడంతో వెనుక వాహనదారులు అప్రమత్తమయ్యేలోపే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఢీకొన్న ధాటికి కార్ల ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో ఎక్స్ప్రెస్వేపై వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
