మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ, వారిపై జరిగే వేధింపులు, గృహహింస వంటి ఘటనలపై తక్షణమే స్పందించాలని అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో మహిళల రక్షణకు సంబంధించిన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.- షీ టీమ్స్, భరోసా కేంద్రం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, గృహహింస నిరోధక విభాగం, మిస్సింగ్ ఉమెన్, మహిళా సహాయ విభాగాలు, ఉమెన్ హెల్ప్ డెస్క్ల పనితీరును సమీక్షించారు. ఆయా విభాగాలకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు, పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను సున్నితంగా ఆలకించి, వారికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- మహిళలపై వేధింపులు, గృహహింస, మానవ అక్రమ రవాణా వంటి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. షీ టీమ్స్ ద్వారా మహిళలు, బాలికలకు భద్రతపై అవగాహన కల్పించాలని, వేధింపులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ అందించడంతోపాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
- మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్ డెస్క్లకు వచ్చే ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.సమావేశంలో సీసీఆర్బీ ఏసీపీ గురు నాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ సురేష్, షీ టీమ్స్ మహిళా ఎస్సై స్రవంతి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యం…ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు…బాధితులకు అండగా నిలవాలి…విభాగాల పనితీరుపై అదనపు డీసీపీ సమీక్ష
RELATED ARTICLES
