తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు నగరంలోని వినాయక్నగర్లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు.
అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. మహిళల కోలాహలంతో వినాయక్నగర్లో పండుగ శోభ సంతరించుకుంది.ఈ వేడుకల్లో శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మంచాల జ్ఞానేందర్ పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతోపాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పద్మ రజిత, పద్మ హరిణి, మంచాల శ్రీలక్ష్మి, శరణ్య, ఆపిల్, మరియు లక్ష్మితో పాటు మిగతా సభ్యులు అందరూ పాల్గొన్నారు.
