HomeDevotionalశక్తి సదన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శక్తి సదన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నగరంలోని శక్తి సదన్‌ స్వధార్‌ హోమ్‌లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయం పొందుతున్న మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.

కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సౌందర్య, అర్బన్‌ సీడీపీఓ విజయలక్ష్మి, స్వధార్‌ హోమ్‌ సబ్‌కమిటీ సభ్యులు, సీనియర్‌ న్యాయవాది మురళీధర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు.

మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పి వారిలో ఆనందాన్ని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో శక్తి సదన్‌ స్వధార్‌ హోమ్‌ సిబ్బంది, ఆశ్రయం పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments