HomeDevotionalశ్రీ వారాహీ క్షేత్రంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

శ్రీ వారాహీ క్షేత్రంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

నగరంలోని అమ్మవెంచర్‌లో కొలువుదీరిన శ్రీ వారాహీ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.ఆలయ ప్రధాన అర్చకులు పశుపతినాథ్‌ శర్మ ఏలేటి, అర్చకులు మహేష్‌ శర్మ ఆధ్వర్యంలో అష్టోత్తర పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ, మంగళహారతి కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ అభిషేకాలు, విశేష పూజలు, వారాహీ మూలమంత్ర హవనం, అష్టోత్తర పూజలు, పల్లకి సేవ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్‌ మంచాల జ్ఞానేందర్‌ గుప్త మాట్లాడుతూ.. ప్రతిరోజూ సాయంత్రం 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అష్టోత్తర పూజలు, పల్లకి సేవ, హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహీ మాత అనుగ్రహం పొందాలని కోరారు.లోకకల్యాణం, సకల జనుల సుఖసంతోషాలు, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలతో శ్రీ వారాహీ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments