HomeLaw and Orderప్రజా ఇబ్బందులపై స్పందన.. ట్రాఫిక్ పునరుద్ధరణ...సీపీ సాయి చైతన్యకు మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కృతజ్ఞతలు

ప్రజా ఇబ్బందులపై స్పందన.. ట్రాఫిక్ పునరుద్ధరణ…సీపీ సాయి చైతన్యకు మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కృతజ్ఞతలు

పండుగ వేళ నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) వద్ద ట్రాఫిక్‌ను పునరుద్ధరించిన పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యకు నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ బిగాల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను సీపీ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

నగరంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల పొడిగింపులో భాగంగా ట్రాఫిక్‌ను వన్‌వేగా మార్చడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గణేశ్‌ బిగాల తెలిపారు. ఇప్పటికే దసరా పండుగ వాతావరణంతో నగరంలోని ప్రధాన రహదారులు రద్దీగా ఉన్నాయని, ఈ సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు మరింత ఇబ్బందులకు గురిచేస్తాయని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని గుర్తించిన ఆయన ఆదివారం ఉదయం ఆర్‌యూబీ ప్రాంతాన్ని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీడియా ద్వారా వెల్లడించారు. అనంతరం ఈ సమస్యను సీపీ సాయి చైతన్య దృష్టికి తీసుకెళ్లారు.

పండుగల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలను దసరా వరకు, సాధ్యమైతే దీపావళి వరకు వాయిదా వేయాలని కోరారు.దీనిపై వెంటనే స్పందించి ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్న సీపీ సాయి చైతన్యతో పాటు పోలీసు అధికారులకు గణేశ్‌ బిగాల ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments