బతుకమ్మ వేడుకలకు పటిష్ట బందోబస్తుఉత్సవ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సాయి చైతన్యబతుకమ్మ సంబరాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రధాన బతుకమ్మ వేడుకల ప్రాంతాలను ఆదివారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.నగరంలోని ఖిల్లా చౌరస్తాలోని బొడ్డమ్మ చెరువు, పులాంగ్ బ్రిడ్జి, కంటేశ్వర్ దేవాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న నేపథ్యంలో బందోబస్తును సమీక్షించారు.
ఉత్సవాలకు వచ్చే మహిళలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రద్దీని నియంత్రించడంతోపాటు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.బతుకమ్మ వేడుకల సందర్భంగా ఉత్సవ ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగించాలని సీపీ సూచించారు.
పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.బందోబస్తులో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, షీ టీమ్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
