HomeLaw and Orderపరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..నిబంధనల అమలుపై నిశిత పరిశీలన

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..నిబంధనల అమలుపై నిశిత పరిశీలన

జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ఏ.వీ ఎంటర్ ప్రైజెస్ సెంటర్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో శనివారం అసిస్టెంట్ సైంటిస్టు (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) పోస్టుల భర్తీ కోసం సీ.బీ.టీ విధానంలో ఎగ్జామ్ నిర్వహించగా,
పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు.

సీ.సీ. కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అన్నది గమనించారు. బయో-మెట్రిక్ హాజరు సేకరణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

కాపీయింగ్ కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద చేసిన ఏర్పాట్లను, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స వసతులతో కూడిన ఏ.ఎన్.ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. ప్రధాన ప్రవేశ మార్గం వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు.

పరీక్షా కేంద్రంలోని ఆయా గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు.
ఈ నెల 26న జరుగనున్న పరీక్షలను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.

కలెక్టర్ వెంట డీ.ఐ.ఈ.ఓ రవికుమార్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments