నిజామాబాద్ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని నిరసిస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భిక్షాటనకు దిగారు.
ప్రజల సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిధుల మంజూరులో నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలనే ఆలోచన లేకపోవడంతోనే తాను ప్రజల వద్దకు వెళ్లి భిక్షాటన చేయాల్సి వస్తోందని అర్వింద్ అన్నారు.
మాధవనగర్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
బ్రిడ్జి పనులు పూర్తిచేసి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
