HomeTelanganaNizamabadఆరేళ్లుగా బ్రిడ్జి కోసం పోరాటం.. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదు..మాధవనగర్‌ ఆర్‌ఓబీకి రూ.9 కోట్ల విడుదలలో...

ఆరేళ్లుగా బ్రిడ్జి కోసం పోరాటం.. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదు..మాధవనగర్‌ ఆర్‌ఓబీకి రూ.9 కోట్ల విడుదలలో జాప్యం.. సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శలు

కేంద్రం వాటా విడుదలైనా రాష్ట్రం నుంచి నిధులు రావడం లేదని ఆరోపణఆర్‌ఓబీ నిర్మాణం కోసం తాను ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నానని, ఎంపీగా ఎన్నికైన తర్వాత చేపట్టాల్సిన అత్యంత ముఖ్యమైన పనుల్లో దీనిని రెండో ప్రాధాన్యంగా పెట్టుకున్నానని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తెలిపారు.

మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు.

మాధవనగర్‌ ఆర్‌ఓబీ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం బీజేపీ ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. మాధవనగర్ ఆర్‌ఓబీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపి అరవింద్ డిమాండ్ చేశారు.

ప్రజలు, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ పోరాటమని ఆయన స్పష్టం చేశారు.పసుపు బోర్డు తర్వాత ఈ ఆర్‌ఓబీ నిర్మాణానికే తాను ప్రాధాన్యత ఇచ్చానని, కేంద్ర రైల్వే శాఖ నుంచి నిధుల కొరత లేదని తెలిపారు.

గతంలో 2 లేన్లు ఉన్న ఆర్‌ఓబీని రైల్వే మంత్రితో మాట్లాడి 4 లేన్లుగా మంజూరు చేయించినట్లు చెప్పారు.డిజైన్ మార్పు వల్ల రూ.9 కోట్ల వ్యయం పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వం పైసా విడుదల చేయకపోవడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయని ఆరోపించారు.

గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అరవింద్.. అప్పటి ముఖ్యమంత్రి కుమార్తె ఇక్కడే ఎంపీగా ఉన్నప్పటికీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లతో 8 శాతం కమీషన్ల కోసం మాట్లాడుకున్నారని, నాటి ఎమ్మెల్యే సైతం ప్రత్యేకంగా పన్నులు వసూలు చేశారని విమర్శించారు.

కాంట్రాక్టర్లు సైతం ఇక్కడ వేధింపులు తట్టుకోలేక పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజకీయ లబ్ధిని పక్కనపెట్టి నిజామాబాద్ ప్రయోజనాల కోసం మాజీ నాయకుడు డి.శ్రీనివాస్ కుమారుడిని చెప్పి ఆర్‌ఓబీకి నిధులు ఇవ్వాలని అడుక్కున్నానని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేశానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అడిగినప్పుడు మాధవనగర్‌ ఆర్‌ఓబీకి సంబంధించి రూ.6.50 కోట్లు విడుదలయ్యాయని, అనంతరం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసి కోరడంతో మరో రూ.3.10 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు.

అయినప్పటికీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణ పనులు మళ్లీ మందగించాయని విమర్శించారు.మాధవనగర్‌, అర్సపల్లి ప్రాంతాల్లో ఆర్‌ఓబీ పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు కోరినట్లు తెలిసిందని అర్వింద్‌ అన్నారు.

అయితే హామీలతో పనులు పూర్తికావని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేయాలని స్పష్టం చేశారు. మాధవనగర్‌ ఆర్‌ఓబీకి కేంద్రం, రాష్ట్రం చెరో 50 శాతం నిధులు సమకూర్చాల్సి ఉందని తెలిపారు. అర్సపల్లి ఆర్‌ఓబీకి పూర్తిగా కేంద్ర నిధులే ఉన్నాయని పేర్కొంటూ, అక్కడి పనుల విషయంలోనూ జాప్యం జరగకుండా చూడాలని కోరారు.

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైల్వే బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు వేగంగా నిర్మితమవుతున్నాయని అర్వింద్‌ పేర్కొన్నారు. ఇందూరు పార్లమెంట్‌ పరిధిలోనూ కేంద్ర నిధులతో పలు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం పూర్తిచేసుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

బోధన్‌ ప్రాంతంలో మంజూరైన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిలకు సంబంధించిన డీపీఆర్‌లు, డిజైన్ల తయారీలో జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రజల రాకపోకలకు కీలకమైన మాధవనగర్‌ ఆర్‌ఓబీ నిర్మాణాన్ని ఇకనైనా వేగవంతం చేయాలని, పెండింగ్‌ నిధులను విడుదల చేసి పనులు పూర్తిచేయాలని అర్వింద్‌ డిమాండ్‌ చేశారు.

*కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు* జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి జీవితంలో ఒక్కసారైనా ఆర్‌ఓబీ కోసం నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు.

కనీసం కౌన్సిలర్‌గా కూడా గెలవని మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్‌ నాయకులకు ఏమాత్రం సోయి లేదని, నిధులు తీసుకురావడం కంటే పదవులు, రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments