HomeTelanganaNizamabadఆర్‌ఓబీకి రూ.9 కోట్లు ఇవ్వలేని సీఎం.. కొడంగల్‌కు వేల కోట్లా?.. మాధవనగర్‌ ఆర్‌ఓబీపై బీజేపీ దీక్షలో...

ఆర్‌ఓబీకి రూ.9 కోట్లు ఇవ్వలేని సీఎం.. కొడంగల్‌కు వేల కోట్లా?.. మాధవనగర్‌ ఆర్‌ఓబీపై బీజేపీ దీక్షలో నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు.. ఉత్తర తెలంగాణపై వివక్ష.. హామీల అమలులో కాంగ్రెస్‌ వైఫల్యం…

రాహుల్‌గాంధీపై విదేశీ శక్తుల కుట్రలకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు .. సన్నబియ్యం ధరల పెరుగుదల, సివిల్‌ సప్లైస్‌లో అక్రమాలు, కాంట్రాక్టర్ల బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీత మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి అవసరమైన రూ.9 కోట్లు విడుదల చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌కు వేల కోట్లు ఎలా కేటాయిస్తున్నారని నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

‘కొడంగల్‌కే ముఖ్యమంత్రివా.. తెలంగాణ మొత్తానికా?’ అంటూ నిలదీశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు.

మాధవనగర్‌ ఆర్‌ఓబీ పూర్తికాక ప్రజలు ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వంలో స్పందన లేదని, నిధుల విడుదలలో జాప్యం ఉత్తర తెలంగాణపై వివక్షకు నిదర్శనమని విమర్శించారు. రాహుల్‌గాంధీ విదేశీ శక్తుల ప్రభావంలో పనిచేస్తూ, బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహా పరిస్థితులను భారత్‌లో సృష్టించి ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఓటు చోరీ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీజేపీ తిప్పికొడుతుందన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మహిళలకు రూ.4 వేల పెన్షన్‌, స్కూటీలు, తులం బంగారం పథకాలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు.

సన్నబియ్యం ధర కిలో రూ.95–100కు చేరడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సివిల్‌ సప్లైస్‌ వ్యవస్థలో కృత్రిమ కొరత సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని, కేంద్రం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

కాంట్రాక్టర్లు బిల్లుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని, డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట ధర్నాలు చేయాల్సి వస్తోందని అన్నారు. బిల్లుల చెల్లింపులకు 10 నుంచి 15 శాతం కమీషన్లు అడుగుతున్నారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments