HomeLaw and Orderనేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం- మెండోరాలో 54 కెమెరాలు ప్రారంభించిన సీపీ సాయి చైతన్య

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం- మెండోరాలో 54 కెమెరాలు ప్రారంభించిన సీపీ సాయి చైతన్య

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి- దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలినేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. మంగళవారం మెండోరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 54 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతోపాటు నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలోనూ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ముఖ్యంగా దుకాణాల యజమానులు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌ నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో ప్రజలు భాగస్వాములై తమ ప్రాంతాల భద్రతకు బాధ్యత తీసుకోవాలన్నారు. 54 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పంచాయతీ ప్రతినిధులను అభినందించారు.

కార్యక్రమంలో ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, గ్రామ వీడీసీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌, సర్పంచి ప్రమోద్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments