బంజారాహిల్స్ పీఎస్ ఎస్సై విజయ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధితుడి నుంచి రూ. 10లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై.. అందులోని రూ.లక్ష తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
దీంతో విజయు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు.
ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ విజయ్ను విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
