HomeCRIMEకుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య..

కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య..

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నందిపేట మండలంలోని వెల్మల్‌ గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం..వెల్మల్‌ గ్రామానికి చెందిన బండకాడి రాజన్న (50)కు నలుగురు కుమార్తెలు.

చిన్న కుమార్తె ఆకాంక్ష అదే గ్రామానికి చెందిన విజయ్‌ను ప్రేమించి బుధవారం ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకుంది. తనకు ఇష్టం లేని వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో పరువు పోయిందని రాజన్న మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం ఉదయం తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.రాజన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments