HomeCRIMEమైనర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలురూ.32 వేల జరిమానా.. బాధితురాలికి రూ.1.50...

మైనర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలురూ.32 వేల జరిమానా.. బాధితురాలికి రూ.1.50 లక్షల పరిహారం

మైనర్‌ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడికి ఎల్‌బీనగర్‌లోని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు జార్పుల గణేశ్‌కు రూ.32 వేల జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.1.50 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

బుధవారం ఈ మేరకు తీర్పు వెలువడింది.పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు తన మైనర్‌ కుమార్తెతో కలిసి జార్పుల గణేశ్‌తో సహజీవనం చేసేది. ఈ క్రమంలో అతడు బాలికపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు కేసు నమోదైంది. ఫిర్యాదుదారు, బాలికకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

2024 అక్టోబరు 29న మామిడిపల్లి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి ఫిర్యాదుదారు, బాలికను తీసుకెళ్లిన నిందితుడు.. అక్కడ బాలికపై మరోసారి లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు గట్టిగా కేకలు వేసి అడ్డుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదుతో 2024 నవంబరు 27న పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.కేసు దర్యాప్తు అధికారి పి.గురువారెడ్డి, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ బి.లక్ష్మీనారాయణరెడ్డి, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కృష్ణ ప్రసన్నతోపాటు కోర్టు డ్యూటీ, సమన్లు అమలు, లైజన్‌ అధికారులు విచారణలో కీలకంగా వ్యవహరించారు.

సాక్ష్యాధారాలను సమర్థంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments