HomeCRIMEప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు..ట్రాన్స్‌జెండర్లకు సీసీఎస్‌ ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్‌

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు..ట్రాన్స్‌జెండర్లకు సీసీఎస్‌ ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్‌

ట్రాన్స్‌జెండర్లు చట్టాలకు లోబడి, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా జీవించాలని సీసీఎస్‌ ఏసీపీ శ్రీశైలం సూచించారు. సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించాలని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ట్రాన్స్‌జెండర్లకు ఆయన కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను ఏసీపీ అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు చట్టాన్ని ఆశ్రయించాలని, సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం పొందాలని సూచించారు.

ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా ఆత్మగౌరవంతో జీవించాలని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే కౌన్సెలింగ్‌ ఉద్దేశమని తెలిపారు.ట్రాన్స్‌జెండర్లకు ఏవైనా సమస్యలు ఎదురైతే సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 14427ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీసీఎస్‌ సీఐలు సురేష్‌, అజయ్‌, సాయినాథ్‌, ఎస్సైలు మహేష్‌, భీమ్రావు, మహిళా ఆర్‌ఎస్‌ఐ స్రవంతి, సఖీ కేంద్రం ఇన్‌ఛార్జి భానుప్రియ, జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments