ద్విచక్ర వాహన చోదకులు తప్పని సరిగా హెల్మెల్ ధరించాలని నగరంలోని నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ శనివారం అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగ్గా హెల్మెట్ ను ధరించాలని హెచ్చరించారు.
హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ ధరించకపోవడంతో అనేకమంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
