బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయామని రైతుల ఆవేదన- సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ జరగలేదని ఆందోళన చేపట్టిన రైతులు-
సీఎం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ జరగాలి- లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరిక- ఆందోళన చేస్తున్న రైతులకు అభయం ఇచ్చిన వినయ్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ముందట రైతన్నలు ధర్నా చేపట్టారు.
ఆలూరు లో 2500 మంది రైతులకు రుణమాఫీ ఖాతాలు ఉంటే కేవలం 500 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండువేల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని వివరించారు. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు భే షరతుగా రుణమాఫీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు.
రుణమాఫీ రాలేదని బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే, ప్రభుత్వ సూచనల మేరకు కట్ ఆఫ్ డేట్ ప్రకారం లిస్టును పంపమని తెలిపారు. ఇంకా వెయ్యికి పైగా రైతుల డాటాను బ్యాంకు అధికారులు పంపలేదని రైతులు ఆరోపించారు.
తమకు ఇప్పుడు రుణమాఫీ ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ రెడ్డి రైతుల నిరసన స్థలానికి నేరుగా వెళ్లారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు .
బ్యాంకు అధికారులు ప్రభుత్వ సూచనల మేరకు అర్హులైన రైతుల పేర్లను పంపాలని సూచించారు. ఆర్మూర్ సిఐ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు.