సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించట్లు ఇందల్వాయి సీఐ మల్లేష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
ఇందల్వాయి మండలంలోని స్టేషన్ తండాకు చెందిన బడవత్ ఉపేంద్ర అనే వ్యక్తి కి ఈనెల 5న మంచిర్యాల జిల్లా కు చెందిన తీగుట్ల మనోజ్ కుమార్ అనే సైబర్ నేరస్తుడు ఫోన్ చేసి మీ పేరు మీద బ్యాంకులో గోల్డ్ లోన్ ఉందని,అందుకు బ్యాంక్ లోనే వెంటనే చెల్లించాలని లేదంటే బంగారం సీజ్ చేస్తామని బుకయించాడు.
దీంతో సదరు బాధితుడు నమ్మే రు.25000 ఫోన్ పే చేయించుకుని బాధితుని బురిడీ కొట్టించాడు.సదరు బాధితుడు మోసపోయినట్టు గమనించి ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ మల్లేష్ తెలిపారు. ఈ పట్టివేతలో ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.