HomeTelanganaNizamabadమోడీ పాలన లో పురోగతి ఫై పుస్తకాలు …..పలువురికి ప్రముఖులకు అందజేసిన అర్వింద్

మోడీ పాలన లో పురోగతి ఫై పుస్తకాలు …..పలువురికి ప్రముఖులకు అందజేసిన అర్వింద్

దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి, విజయాలను వివరించే పుస్తకాలను ఎంపీ అర్వింద్ సోమవారం ఆయా రంగాలకు చెందిన పలువురు కి అందజేశారు ఇందూరు జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది అయినపూడి సంగమేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో తన కళాశాల సీనియర్‌ను ఏడాదికి పైగా నిర్బంధించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోడీ ప్రారంభించిన ఈ సుపరిపాలన, అభివృద్ధి యజ్ఞం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

ప్రముఖ భజన కారుడు, ముదిరాజ్ సంఘ పూర్వ అధ్యక్షులు శ్రీ అంబెం నడ్పి సాయిలు 82 మరియు పూర్వ కౌన్సిలర్ అయిన వారి శ్రీమతిని కలిసి అర్వింద్ కాసేపు మాట్లాడారు ఇందూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి కుమారి గుగులోత్ సౌమ్య (“చీతా” సౌమ్య) గారిని కలిసి అందించాను.

ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో వివిధ పతకాలు సాధించినందుకు ఆమె కు శుభాకాంక్షలు తెలియజేశారుపీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో రూ 10వేలు రెండవ విడతలో రూ 20వేలు మూడవ విడతలో రూ 50,వేలు లోను తీసుకొని చెప్పల దుకాణం నడుపుకుంటున్న ఇందూరు నగరంలోని కంటేశ్వర్ కు చెందిన లబ్ధిదారు కే. శోభ గారిని కలిసాను.

ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments