HomePOLITICAL NEWSUncategorizedబే షరతుగా రుణమాఫీ చేయాలి-మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి - వేల్పూర్ క్రాస్ రోడ్...

బే షరతుగా రుణమాఫీ చేయాలి-మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద రైతు ధర్నా

పెద్ద ఎత్తున తల్లి వచ్చిన రైతులు- రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు భేషరతుగా రుణమాఫీ వర్తింపజేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద రుణమాఫీ వర్తించని రైతులతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రేవంత్ రెడ్డి రైతు మాఫీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సుమారు అరగంట సేపు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రుణమాఫీకి సంబంధించిన డిమాండ్ పత్రాలను తీసుకోవడానికి ఆర్డిఓ రావాలని పట్టుబట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు దీక్ష శిబిరంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…. పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలన్ని ఎటువంటి కొర్రీలు పెట్టకుండా మాఫీ చేయాలని అన్నారు.

రుణమాఫీ రైతులందరికీ వర్తించే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలేదిలేదని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపును ఇచ్చారు.

హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన రేవంత్ రెడ్డి , హరీష్ రావును రాజీనామా చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు.

బూటకపు హమిలిచ్చి రైతులను మోసం చేసిన నీవే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ 300 రోజులు గడుస్తున్న హామీల నెరవేర్పుకు కనీసం కృషి చేయడం లేదని విమర్శించారు.

శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ఆర్మూర్ ఎసిపి బస్వా రెడ్డి తోపాటు భీంగల్ సిఐ లు, ఎస్ఐలు , పోలీసు బందువస్తు నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments