నూతనంగా నిర్మిస్తున్న భవనం పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…ఛత్తీస్ ఘడ్ కు చెందిన కవిత(28)భర్త, పిల్లలతో గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో ఉంటున్నారు.
ఈ మేరకు రోజువారీగా కూలీకి వెళ్ళిన కవిత కళ్ళు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.