టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ నేతృత్వంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఒక మంచి ఆశయం కోసం యువత ఇంతలా ముందుకు రావడం అభినందనీయమని నాయకులు కొనియాడారు.
ఈ రక్తదాన శిబిరానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నగర మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, అర్బన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై, రక్తదానం చేసిన యువకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
