భారీ వర్షాలకు పోటెత్తిన వరద – నేడు గేట్లు ఎత్తివేసే అవకాశం – పరివాహ ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేసిన అధికారులు
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ ఏడాది సగం వర్షాకాలం దాటిపోయిన ఇప్పటివరకు ఆశించిన నీరు రాలేదు. కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీకి వరద నీరు పోటెత్తింది.
దీంతో శ్రీరామ్ సాగర్ లోకి భారీ ఇన్ఫ్లో కోనసాగుతోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్ర నుంచి భారీ వరద నీరు 1.57.274 క్యూసెక్కులు శ్రీరాంసాగర్ కి పచ్చి చేరుతుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 TMC లు కాగా… ప్రస్తుతం 1087.6 అడుగులకు 68.433 టీఎంసీలుగా నీరు నిలువ ఉంది.
వరద ఇలాగే కొనసాగితే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని, ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు.
