రైల్వే ఎస్సై సాయి రెడ్డి…పోగొట్టుకున్న సొమ్మును తిరిగి అప్పగించిన రైల్వే పోలీసులు.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ కు చెందిన అరబిందో ఫార్మసీ మేనేజర్ శ్రీధర్ రెడ్డి బుదవారం రాయలసిమ ఎక్స్ ప్రెస్ నందు కడప నుంచి బెంగంపేట్ రైల్వే స్టేషన్ లో తన వద్ద ఉన్న హ్యాండ్ బాగ్ ను మరిచి వెళ్ళిపోయాడు.
అందులో 2 లక్షల 20 వేల రూపాయలు ఉన్నట్లు తెలిపారు.తిరిగి గుర్తు చేసుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు నిజామాబాద్ రైల్వే పోలీసులు రైలును నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో రైలుని ఆపి గాలించగా బ్యాగు లభ్యమైంది.
దీంతో గురువారం బాధితుని పిలిచి అందజేసినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
