మనస్థాపానికి గురై ఉరి వేసుకుని మహిళ ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో ఉంటున్న పుదరి లింగమని(49).ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందారు.
లింగమని గత కొన్ని రోజులుగాఆరోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. మనస్థాపానికి గురై ఈ మేరకు బుధవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఇంట్లోనే ఉన్న చిన్న కూతురు ఎంతసేపటికి రాకపోయేసరికి బాత్రూంలోకి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉందని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగవ టౌన్ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
