HomeCRIMEఅభయ పై అత్యాచారం ఘటన ఫై పి.డి.ఎస్.యూ కొవ్వొత్తులతో నిరసన

అభయ పై అత్యాచారం ఘటన ఫై పి.డి.ఎస్.యూ కొవ్వొత్తులతో నిరసన

పశ్చిమబెంగాల్ రాష్ట్రం లోని కలకత్తా లో ఆర్ధికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న అభయ పై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని

సుప్రీం కోర్టులో విచారణ ఉన్నందున వారికి సపోర్ట్ చేసే వారి పట్ల కఠినంగా ఉండాలని డిమాండ్ చేస్తూ రాత్రి తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ లో పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తే. యూ పి.డి.ఎస్.యూ నాయకులు జయంతి,బిందు లు మాట్లాడుతూ కలకత్తా మహా నగరంలో మెడికల్ కాలేజీ విద్యార్థి అభయ పై జరిగిన అత్యాచారాన్ని దేశంలో

ఉన్నటువంటి ప్రజలు మేధావులు ఖండిస్తున్నారు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అభయపై అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేశారు ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గానీ అక్కడ శాంతి భద్రతలు కాపాడే పోలీస్ యంత్రాంగం గాని దోషులను నిర్ధారణ చేయకుండా అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్న విధానాన్ని పి.డి.ఎస్. యూ తీవ్రంగా ఖండిస్తుంది.

అభయ పై అత్యాచారం చేసిన నిందితులను గుర్తించి వారిపై అత్యాచారం కేసులు నమోదు చేయాలని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాo.

రాష్ట్రంలో దేశంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను ప్రజలు ప్రజా స్వామ్య వాదులు ఖండించాలన్నారు.

రేపు సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరుగుతుందని అత్యాచారానికి,హత్యకు గురైన అభయ కు తగిన న్యాయం చేయాలని నేరస్తులకు సరైన శిక్షలు విధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కవిత, సౌమ్య, బావని, నవ్య, వని తడితదిరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments