నిజామాబాద్ నగరంలోని శంభుని ఆలయం యెక్క హుండీ కానుకలను శుక్రవారం ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు.
ఆలయ ఖజానాకు రూ. 54,772 ఆదాయం సమకూరిందనీ పేర్కొన్నారు.
భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన కానుకలను గుడి చైర్మన్ గండ్ల లింగం ఆద్వర్యంలో వ్రతమండపంలో లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమల, ఈఓ రవీందర్,జూనియర్ అసిస్టెంట్ కిషోర్,తదితరులు పాల్గొన్నారు.
