ఆసుపత్రి ఖర్చుల విషయంలో తలెత్తిన వివాదం చివరికి ఆవేశంలో మరిది తన సొంత వదిననే కడతేర్చాడు . ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో శుక్రవారం జరిగింది.
పోలీసులు చెప్తున్న కథనం మేరకు గ్రామానికి చెందిన మంద పోచయ్యకు ఇద్దరు కుమారులు.చిన్న కొడుకు సురేష్ వద్దే ఉంటున్నాడు తరచూ ఆసుపత్రులకు తీసుకెళ్తూ వైద్యం చేయిస్తున్నారు.
డబ్బులు ఖర్చవుతుండడంతో భారం అవుతుంది అందుకే అన్న భార్య యేసుమణి (42)ని పలుమార్లు డబ్బులు ఇవ్వాలని కోరాడు ఆస్థి లో వాటా తీసుకోని ఆరోగ్యం బాగాలేక పొతే నయా పైసా ఇవ్వను అంటే ఎలా అని సురేష్ వదిన తో అడిగేవాడు .
ఇదే విషయంలో సురేష్ కు వదిన యేసుమణి లమధ్య మాట మాట పెరిగింది వదిన పరుష పదజాలం తో తిట్టడంతో , కోపంతో ఊగిపోయిన సురేష్ కత్తి తో వదినను పొడిచారు.
దీంతో యేసుమణి అక్కడికక్కడే మృతి చెందింది.బిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
